మాతంగి రవికుమార్ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, వేములనర్వ గ్రామవాసి జనసేన వత్సవాయి మండల కార్యదర్శి మాతంగి రవికుమార్ స్వర్గస్తులైన కారణంగా వారి కుటుంబాన్ని పరామర్శించి.. వారికి మనోదైర్యం కల్పించి కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ చేతులమీదుగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ మరియు ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ లక్ష్మి వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఎల్లప్పుడు వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జగ్గయ్యపేట నియోజకవర్గ నాయకులు మండల నాయకులు పార్టీ శ్రేణులు వీరమహిళలు పాల్గొన్నారు.