ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సహాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. తాజాగా మరో పథకాన్ని ప్రభుత్వం అమలులోనికి తీసుకురానుంది. ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సహాయం చేయబోతున్నది. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,71,302 డ్వాక్రా సంఘాలకు చెందిన 87,74,674 మంది మహిళలకు ఆసరా పథకం ద్వారా ఆర్ధిక సహాయం చేయబోతున్నారు. రూ.6,792.20 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాలో జమ చేయబోతున్నారు. ఇప్పటికే ఆసరా పథకం ద్వారా లబ్ది పొందుతున్నవారి పేర్లను గ్రామ, వార్డు సచివాలయంలో ఉంచారు. అర్హత ఉండి, లిస్ట్ లో పేర్లు లేకుంటే, వారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయంలో నమోదు చేసుకోవాలని, పరిశీలించి సహాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.