క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన అతికారి దినేష్

రాజంపేట: సిద్ధవటం మండల కేద్రంలోని దిగువ పేట ఆకుల వీధిలో జనసేన యువ నాయకులు అతికారి దినేష్ సోమవారం 310 క్రియాశీలక కిట్లను పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో అతికారి దినేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న 310 మందికి జనసేన పార్టీ అధినాయకత్వం సూచన మేరకు కిట్లను పంపిణీ చెయ్యడం జరిగింది. జనసేన పార్టీ క్రియశీలక సభ్యత్వం తీసుకున్న జనసైనికుడికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే తక్షణమే 50,000/ రూపాయలు నగదు, మృత్యువాత పడితే 5 లక్షల రూపాయలు వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఇంత వరకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ తీసుకొని నిర్ణయం మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారని అతికారి దినేష్ అన్నారు. రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం-జనసేన పార్టీల పొత్తులతో రాష్ట్రంలో అధికారంలోకి రావడం తద్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం సర్పంచ్ ప్రతినిధి బి ఓబులయ్య, జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ మునిస్వామి, జనసేన పార్టీ నాయకులు నాగరాజా పోలిశెట్టి శ్రీనివాసులు, ఆవుల నాగేంద్ర, విజయ్, ఏ చిన్న వెంకటయ్య, ఆవుల రాజా, పసుపులేటి కళ్యాణ్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.