Bobbili: సీతానగరం జనసైనికుడి బైక్ ధ్వంసం

విజయనగరం జిల్లా సీతానగరం మండలం గెడ్డలుప్పి గ్రామానికి చెందిన జనసేనపార్టీ జనసైనికుడు అల్లు రమేష్ అనే వ్యక్తి బైకుని రైతులకోసం షుగర్ ఫ్యాక్టరీపై పోరాటం చేసినందుకు వైస్సార్సీపీ పార్టీ వాళ్లే ధ్వంసం చేశారు అని అనిపిస్తుంది.

రాత్రి 8 గంటల సమయంలో నూతనంగా నిర్మితమవుతున్న గెడ్డలుప్పి బ్రిడ్జిపై రోజులాగే పార్క్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు కానీ ఉదయం 4 గంటలకు వెళ్ళి చూసే సరికి బైక్ బ్రిడ్జి కింద ఏరులో పడి ఉంది, వెంటనే జనసేనపార్టీ ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు, మండల జనసేన నాయకులు మరియు జనసైనికులు వెంటనే అక్కడికి వెళ్లి అల్లు రమేష్ కి భరోసా ఇవ్వడం జరిగింది అనంతరం మాట్లాడుతూ మొన్న షుగర్ ఫ్యాక్టరీ బాధితుల రైతులకు అండగా జనసేనపార్టీ ద్వారా నిలబడి పోరాటం చెయ్యడం స్థానిక నాయకులకు నచ్చక ఇలా చెయ్యడం దారుణమయిన చర్య, రైతుల కోసం పోరాటం చెయ్యడం తప్పా అని ప్రశ్నించారు..? రాష్ట్ర డీజీపీ గారు ఎప్పుడు అధికారపార్టీకి కొమ్ము కాయడం ఆపి రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోని పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు మరియు అల్లు రమేష్ మాట్లాడుతూ నాలాంటి జనసైనికుడిని బెదిరించడానికి బైక్ ధ్వంసం చెయ్యడం ద్వారా జనసేనపార్టీ వెనక్కి తగ్గదు అని నా ప్రాణం ఉన్నంతవరకు జనసేనపార్టీ జెండా వదలను అని విజ్ఞప్తి చేశారు, అలాగే శివశంకర్ పోతల మాట్లాడుతూ జనసేనపార్టీ అంటే అధికార పక్షానికి ఎంత భయమో అని నిరూపితం అయ్యింది అని, ఇంకొకసారి జనసేన కార్యకర్తలపై ఇలాంటి దాడులు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు రైతుల కోసం చేసే పోరాటంలో మేము ఎదో పెద్ద తప్పు చేసినట్టు ఈడ్చుకుంటూ అరెస్ట్ చేసారని అలాగే ఇలాంటి చర్యలు చేసినవాడిని కనిపెట్టి అలాగే తీసుకొని వెళ్లాలని డిమాండ్ చేశారు, వెంటనే సీతానగరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్ఐ మురళి గారికి జనసేనపార్టీ శ్రేయోభిలాషి శ్రీ సంతోష్ గంగాధర్ లాయర్ ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇచ్చి మండలంలో మా జనసైనికులపై కానీ నాయకులపై కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పడం జరిగింది. అలాగే బొబ్బిలి డిఎస్పి ఆఫీస్లో కూడా జనసైనికులపై కానీ, వారి ఆస్తులపై కానీ దాడి జరిగితే ఊరుకునేది లేదని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసైనికులు రమేష్, గంగాధర్, సూర్యనారాయణ, త్రిలోక్, సత్యనారాయణ, వెంకటరమణ, శంకరరావు, గౌరి, ధర్మ, సంజు మరియు గెడ్డలుప్పి జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.