Krishna: AIYF ఆధ్వర్యంలో కృష్ణజిల్లా సమగ్రాభివృద్ధి పై జరిగిన సమావేశం

AIYF ఆధ్వర్యంలో కృష్ణజిల్లా సమగ్రాభివృద్ధి పై జరిగిన సమావేశంలో జనసేనపార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆదేశాల మేరకు రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యాంశాలు.

కొన్ని అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావించడం జరిగినది.

  1. మచిలీపట్నంలో పోర్ట్ కడతాను అని చెప్పి ఇంతవరకు కనీసం శంకుస్థాపన కూడా చేయనటువంటి పరిస్థితి. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి అడుగు ముందుకు వేయాలి.
  2. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఆటోమొబైల్ రంగంలోని ఆసియాలోనే అతిపెద్ద అయినటువంటి ఆటోనగర్ అభివృద్ధి కార్మికుల సమస్యలను పూర్తిగా విస్మరించారు.
  3. నూజివీడులో మామిడి ఎగుమతి కేంద్రాలను మరియు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి ఇంత వరకు కనీసం దాని ఊసే ఎత్తడం లేదు.
  4. చేనేత కార్మికుల జీవితాలు చీకటిమయంగా మారిపోయాయి లబ్ధిదారులను బెదిరించడంలో ఉన్న శ్రద్ధ చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజాప్రతినిధులకు లేదు.
  5. కొండపల్లిలో ఇండస్ట్రియల్ ప్రాంత అభివృద్ధితో పాటు కొండపల్లి బొమ్మల పరిశ్రమని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా కనీస ప్రోత్సాహం కరువైంది
  6. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్న భవాని ఐలాంద్ గాంధీ కొండ మచిలీపట్నం బీచ్ కనీస అభివృద్ధికి నోచుకోవడంలేదు.
  7. ప్రతి ఏడాది నందిగామ పరిసర ప్రాంతాల్లో సుబాబుల్ పండించే రైతులకు సకాలంలో చెల్లింపులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ ప్రభుత్వం ఇంతవరకు వారికి పరిష్కారం చూపించలేకపోయారు.
  8. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి విమాన రాకపోకలు నేడు దేశానికి పరిమితమవడం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది.
  9. నీవర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 20 వేల రూపాయల పంట నష్టపరిహారం చెల్లించాలని పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను కలిసి వారి సాధకబాధకాలను తెలుసుకొని కలెక్టర్ కార్యాలయంలో కూడా వినతిపత్రం ఇచ్చారు అయినా రైతులకు న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వం రైతు ద్రోహి ప్రభుత్వం కాదా.
  10. విద్యల వాడ విజయవాడలో ఎయిడెడ్ పాఠశాలలు మూసివేయడం వలన ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేకపోవడం వలన అందరూ ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించక తప్పదు అయినా ఈ ప్రభుత్వం పేద సామాన్య వర్గాల ప్రజలు ఉన్నత విద్యను చదువుకో కూడదని కుట్ర చేస్తోందని భావన ప్రజలకు కలుగుతుంది.