అట్టహసంగా జనసేన యువ కెరటాలు సభ

నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురంలో లోకం మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కెరటాలు సభ యువతతో అట్టహసంగా కొనసాగింది, ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకి సంబంధించిన యువతీ యువకులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు, యువతని ఉద్దేశించి మాధవి మాట్లాడుతూ ప్రతి ఒక్క జనసైనికుడూ జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని అన్నారు. ఈ వైఎస్ఆర్సిపి పాలన పోయి జనసేన పాలన రావాలని ప్రతి ఒక్కరికి సూచించారు. జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ 25 సంవత్సరాలు వెనుకబడిందని, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవని, రాష్ట్రంలోకి ఒక పరిశ్రమ కూడా తీసుకుని రాలేదని అంతేకాకుండా ఉన్న పరిశ్రమల్ని మళ్ళీ వెనక పంపించేలాగా చేశారని, ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, పిల్లలు చదువుకోవడానికి సరైన వసతులు లేవని, వస్తున్న ఒకటో రెండో పరిశ్రమలు కూడా సరైన వసతులు లేవని, రాహితులు లేవని చెప్పారు. ఇటువంటి పాలన పోవాలంటే జనసేన పార్టీని గెలిపించాలని లోకం మాధవి సూచించారు. తమ ముఖ్య ఉద్దేశం ఈ చెత్త పాలన ని పాలద్రోలి, మంచి పాలన ని తీస్కొని రావాలి అని పేర్కొన్నారు, యువత నే భవిష్యత్తు రాజకీయాలలో
ముఖ్య పాత్ర పోషించాలి అని పిలుపునిచ్చారు, పరిశ్రమలలో మనమే ఎందుకు భాగం కాకూడదు అని మనమే ఎందుకు పరిశ్రమలు స్థాపించకూడదు అని మాధవి చెప్పారు. వలస అనేది వారసత్వంగా మారింది అని ఇది గత పాలకుల అశ్రద్ధనే అని మాధవి గారు పేర్కొన్నారు. తను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు అయిన ఎప్పుడు కార్యకర్తల సంక్షేమం కోసమే తపన పడేవారు అని అందులో భాగంగానే జనసేన క్రియా శీలక సభ్యత్వం ద్వారా జనసైనికులకి 5 లక్షల భీమా అందజేస్తున్నారని మాధవి తెలియజేసారు, ప్రతి ఒక్కరూ సేనాని కింద సైనికులులా పనిచెయ్యాలని, కృషి చేయాలని 2024లో వార్ వన్ సైడ్ అయిపోవాలి అని, అందుకు కావాల్సిన కృషి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీస్కొని కష్టపడాలి అని తెలియజేసారు, కార్యక్రమంలో వివిధ మండలాలకి చెందిన విద్యార్థి విద్యార్థినిలు మరియు నిరుద్యోగ యువత సభలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై దుమ్మెత్తి పోశారు.