మూడో టి-20లో ఆసీస్ విజయం

సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగిన చివరి టీ 20లో ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 187 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లకు ఏడు వికెట్లు నష్టపోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం వృథా అయింది. అతనికి తోడుగా మరో బ్యాట్స్‌మెన్ ఎవరు రాణించకపోవడం భారత్ విజయావకాశాలను దెబ్బతీసి ఆసీస్ విజయం సాధించింది.  మరోవైపు సమష్టిగా రాణించిన ఆసీస్ ఈ విజయంతో క్లీన్ స్వీప్‌ నుంచి తప్పించుకుంది.  

కాగా, అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 186/5 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్(80), మాక్స్‌వెల్(54) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిడిల్ ఓవర్లలో సిక్స్‌లు, ఫోర్లతో ఆసీస్‌కు భారీ స్కోర్‌ను అందించారు. కాగా, మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకోగా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్వీప్సన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ హార్దిక్ పాండ్యాలకు దక్కింది.