4వ రోజుకు చేరుకున్న అవనిగడ్డ జనసైనికుల రిలే నిరాహారదీక్ష

అవనిగడ్డ – కోడూరు ప్రధాన రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహారదీక్ష 4వ రోజుకు చేరుకుంది. శనివారం నాగాయలంక మండల జనసైనికులు దీక్షలో కుర్చోగా, నియోజకవర్గ జనసైనికులు సంఘీభావం ప్రకటించారు. 50 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేయించటానికి ప్రయత్నం చేయుచున్నట్లు తెలిసిందని, ఎవరి జేబులు నింపుకోవడానికి ఈ రకంగా తాత్కాలిక మరమ్మతులు చేయిస్తామని బూటకపు మాటలు చెప్తారని జనసైనికులు మండిపడ్డారు. గతంలో కూడా 80 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేయించారని, కానీ ఏమాత్రం పని జరిగినట్లు కనిపించడం లేదని, అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకోవడానికి మాత్రమే తాత్కాలిక మరమ్మతులు పేరుతో కాలయాపన చేస్తున్నారని జనసేన నేతలు దుయ్యబట్టారు. టెండర్లు పిలిచాము, అగ్రిమెంట్ అయిందని చెప్పిన వైసీపీ నాయకులు రుజువులు చూపించగలరా అని సవాల్ విసిరారు. భూటకపు మాటలు చెప్తూ, ఈ రహదారి కోసం నిధులు మంజూరు కాకుండానే మంజూరు అయినట్లు అబద్ధాలు చెప్తున్న మీ మాటలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఇంతమంది జీవితాలతో చెలగాటం ఆడుతున్న మిమ్మల్ని ఇంటికి సాగనంపడానికి నియోజక వర్గ ప్రజలు సిద్దంగా ఉన్నారని వైసీపీ నాయకులను ఉద్దేశించి, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. పనులు ప్రారంభించే వరకు ఏదో ఒక రూపంలో ఉదయం చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగాయలంక మండల పార్టీ అధ్యక్షులు చింతా వెంకటేశ్వరరావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కమిటీ కార్యదర్శి లంకే యుగంధర్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, అవనిగడ్డ, కోడూరు మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, మర్రే గంగయ్య, బండ్రెడ్డి మల్లిఖార్జునరావు, బొడ్డు విజయ్, బోనం పాపారావు, రేమాల మురళి, లేబాక అంకాలరావు, కొక్కిలిగడ్డ రమేష్, వీరమహిళ శిరీష, బలరాం, వడ్లమూడి రామకృష్ణ, యర్రంశెట్టి నాగ బసవయ్య, మేకా సురేష్, పిట్టల్లంక గ్రామ సర్పంచ్ కనాగాల వెంకటేశ్వరరావు, బచ్చు ప్రశాంత్, బాచ్చు శ్రీహరి, కోసూరి అవినాష్, బొప్పన పృధ్వీ, వార్డు మెంబర్ కమ్మిలి సాయి భార్గవ తదితరులు పాల్గొన్నారు.