మంత్రి అనీల్ కుమార్ పై చెన్నారెడ్డి మనుక్రాంత్ ఘాటైన సెటైర్లు

నెల్లూరు నగర శాసనసభ్యులు, మాజీ మంత్రి అనీల్ కుమార్ మాట్లాడిన మాటలకు ప్రతిస్పందనగా నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఘాటుగా సెటైర్లు, విమర్శలు చేసారు. ఈ సమావేసంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గ సరిహద్దులు, వార్డు సరిహద్దులు మాకు బాగా తెలుసు కానీ.. క్రికెట్ గ్రౌండ్ బౌండరీలు మాత్రం మీ అంత బాగా మాకు తెలియదంటు.. తమదైన శైలిలో సెటైర్లు వేశారు. క్రికెట్ బెట్టింగ్ కేసులలో మీ లాగా విచారణ ఏదుర్కొలేదు.. నేను టెక్నాలజీ కంపెనీ లకు కి సి.ఈ.ఓ ని.. డేటా గురించి నాకు చాలా స్పష్టత ఉందని.. బూత్ టు బూత్ , డోర్ టు డోర్, ఓటర్ టు ఓటర్ గూగుల్ ఎర్త్ జీఓ ట్యాగింగ్ సంవత్సారం కిందే చేసుకొని వున్నాము. మీకు కూడా కావాలి అంటే షేర్ చేస్తాము.. కోట్ల రూపాయల సంపాదనను, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని.. పుట్టిన ఊరు నెల్లూరుకి ఏదన్నా చెయ్యాలనే తపన, సంకల్పంతో తన కుటుంబం మొత్తం నెల్లూరు లోనే ఉందని.. అనీల్ కుమార్ గారి లాగా ఎమ్మెల్యేగా గెలవబడి తన నివాసాన్ని చెన్నై కి మార్చుకోలేదు అని ఘాటుగా నిలదీశారు. ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి నెల్లూరు నగరంలో ఉండే 28 డివిజన్లలో ఒకే సారి మీ వైసీపీ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను గడప గడపకు తీసుకెళ్లి మీరు నెల్లూరు నగర ప్రజలకు చేసిన అన్యాయాలను తెలియపరుస్తామని అన్నారు. అనీల్ కుమార్ ని ఉద్దేశిస్తూ.. రాబోయే ఎన్నికలలో నెల్లూరు నగరంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యరిగా అనేక పేర్లు మాకు వినిపిస్తున్నాయని.. మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసిన మీకు ఎమ్మెల్యేసీటు అనుమానం అనే టాక్ వస్తుంది అంటే మీరు ఎంత బలంగా ఉన్నారో తెలుసుకోవాలి.. నన్ను తమ్ముడు అన్నారు ఎంతో సంతోషంగా ఉంది .! ఒక అన్నాగా మీ తమ్ముడు గా భావించే నన్ను నెల్లూరు నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన భాధ్యత మీకు కూడా ఎంతో ఉంది అని తెలియచేసారు.