జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన బి.పి.నాయుడు

పాలకొండ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వీరఘట్టం మండలం, నడుకురు గ్రామానికి చెందిన ఉత్తరాంధ్ర జనసేన క్రియాశీలక సభ్యుడు బి.పి.నాయుడు. ఈ సందర్బంగా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలోని ప్రధాన సమస్యలను పవన్ కళ్యాణ్ కి తెలియజేసారు. ముఖ్యంగా ఆర్.టి.సి.బస్ స్టాండ్, డిగ్రీ కాలేజీ భవనాలు, కిమ్మి – ఋషింఘి వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం, నాగావళి ఎడమ కాలువ అనుబంధ కాలువలు ఆధునీకరణ, వీరఘట్టం మండలం కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం అభివృద్ధి.. 50 పడకల హాస్పిటల్ గా ఆధునీకరణ, వీరఘట్టం మండలం ఎం.పి.పి స్వగ్రామానికి రోడ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ఐదు గ్రామాల ప్రజల సమస్యలు, మండల పరిధిలోని వివిధ ప్రాంతాలకు రహదారులు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనుల సమస్యలను పవన్ కళ్యాణ్ కు బి.పి.నాయుడు తెలియజేసారు.