ప్రగడపల్లి గ్రామంలో బాబు జగజ్జివన్ రామ్ విగ్రహావిష్కరణ

పోలవరం మండలం, ప్రగడపల్లి గ్రామంలో బాబు జగజ్జివన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం మండల అధ్యక్షులు గుణపర్తి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా బుజ్జి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు, రాధా రంగ మిత్రమండలి కమిటీ నాయకులు నాగరాజు, రిటైర్డ్ ఎస్సై రాజు పాల్గొన్నారు. వారు అన్ని కులాలను, మతాలను సమానంగా చూడాలని, ఆయన జీవితం అందరికి మార్గదర్శకం అని, రేపటి తరాలకోసం ఆయన పడిన కష్టాన్ని రాబోయే తరాలకు వివరించవలసిన భాద్యత అందరి మీద ఉందని, దళితులు దిగువ కులాలు కూడా రాజ్యాధికారం పొందాలని.. అవే లక్ష్యాలతో నేడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారని, వచ్చే ఎలక్షన్ లో పార్టీ చూడకుండా ఆలోచించుకుని ఓటు వెయ్యాలని అన్నారు. విగ్రహావిష్కరణ కోసం కష్టపడ్డ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి, జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము, ప్రగడ రమేష్, ప్రేమ్ కుమార్, నాగేంద్ర, బాల యేసు, సాయి కృష్ణ, మామిడిపల్లి ప్రసాద్, సీతయ్య, సిద్దన రాంబాబు, రామకృష్ణ మండల కమిటీ సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.