వాలంటీర్ విజయలక్ష్మి కి జనసేన తరఫున అండగా ఉంటాం: బాబు పాలూరు

  • బొబ్బిలి మున్సిపాలిటీ, 31వ వార్డు వాలంటీర్ పై ఆ వార్డు కౌన్సిలర్ భర్త వేధింపులు
  • మనస్థాపం చెంది ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాలంటీర్
  • బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో 31వ వార్డు వాలంటీర్ గొల్లపల్లి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో 31వ వార్డు వాలంటీర్ గొల్లపల్లి విజయలక్ష్మిపై ఆ వార్డు కౌన్సిలర్ భర్త వేధింపుల కారణంగా మనస్థాపం చెంది వాలంటీర్ విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసారు. బాధిత కుటుంబాన్ని బుధవారం బొబ్బిలి ప్రభుత్వం ఆసుపత్రిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, జనసేన నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వాలంటీర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. 31వ వార్డు కార్పొరేటర్ భర్త వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది, అర్హులకు కాకుండా వారికి నచ్చిన వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని నన్ను ఒత్తిడి చేస్తున్నాడని అదే కాకుండా, మాట వినకపోతే వాలంటీర్ ఉద్యోగం నుంచి తప్పిస్తామని బెదిరిస్తున్నారని, నన్ను వ్యక్తిగతంగా టార్చర్ చేస్తున్నారని తట్టుకోలేక మనస్తాపం చెంది ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు జనసేన నాయకులకు ఆమె తెలిపారు, వాలంటీర్ విజయలక్ష్మి కి న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ అండగా ఉంటుందని బాబు పాలూరు హామీ ఇచ్చారు. జనసేన పార్టీ బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, తెర్లాం మండల అధ్యక్షులు మరడాన రవి, వీరమహిళా బంటుపల్లి దివ్య, గైనెడి రమ్య, ఎందువ సత్యన్నారాయణ, చీమల సతీష్ వున్నారు.