పడాల అరుణను మర్యాదపూర్వకంగా కలిసిన బాబు పాలూరు

గజపతినగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా ఆడపడుచు, మాజీ మంత్రి వర్యులు శ్రీమతి పడాల అరుణ మన జనసేన పార్టీ పీఏసీ మెంబర్ గా నియమింపబడిన శుభ సందర్భంగా జనసేన పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో ఆదివారం శ్రీమతి పడాల అరుణను తమ‌స్వగ్రృహంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, రామభద్రపురం మండల అధ్యక్షులు బవిరెడ్డి మహేష్ , లెంక రమేష్, పళ్ళెం రాజా, అడబాల నాగు, పొట్నూరు జనార్థన్, వఝల జగన్నాధం, శంభాన హరిచరణ్, విజయనగరం జిల్లా కార్యనిర్వాహణ కమిటీ కార్యదర్శులు మోతి దాసు, గంట్యేడ స్వామి నాయుడు, ఉమా మహేష్, ప్రగడ కళ్యాణ్, మామిడి సత్యనారాయణ, పోతల శివశంకర్, పూడేసు మహేష్, యామల రామారావు, అల్లు రమేష్ తదితర జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది.