రామ్మోహన్ రావు నాయకత్వంలో బాదుడే…బాదుడు నిరసన

శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం వేస్తున్న పన్నులు భారానికి శనివారం ఆమదాలవలస నియోజకవర్గంలో పేడాడ. రామ్మోహన్ రావు నాయకత్వంలో బాదుడే…బాదుడు అనే నినాదాలతో హోరెత్తించి కాగడాలతో నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మరీ ముఖ్యంగా విద్యుత్ చార్జీలు, బస్ చార్జీలు, నిత్యావసర సరుకుల,ఇంటి పన్ను, చెత్త పన్ను ఎలా బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టుకున్నారని వీటన్నిటినీ తక్షణమే ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పైడి మురళీ మోహన్, చిన్నమ నాయడు, గణేష్, రమణ, ధనుంజయ, అప్పలరాజు, శివ, ఫణి కుమార్, పవన్, శ్రీనివాస్, రాజశేఖర్, కోటేష్, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.