పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ బుధవారం ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం జార్జి పేట గ్రామంలో అకాల మరణం చెందిన జార్జి పేట గ్రామ సర్పంచ్ కోల సత్య దేవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వారి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. అదే గ్రామంలో అకాల మరణం చెందిన మరినిడి నాగన్న కుటుబసభ్యులను మరియు అదే గ్రామాoలో అకాల మరణం చెందిన వాసంశెట్టి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు. పార్టీ సీనియర్ నాయకులు గోదాసి పుండరీష్ జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్లూరి ప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాల మహిళా సంయుక్త కార్యదర్శి ముత్యాల జయ, తాళ్ళరేవు మండలం అధ్యక్షులు అత్తిలి బాబు రావు, ఐ.పోలవరం మండలం అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, ముమ్మిడివరం మండల ప్రధాకార్యదర్శి దూడల స్వామి, లంకలపల్లి వెంకటేశ్వరరావు, పువ్వల జయ ప్రకాష్, రాయుడు గోవిందు, ఎంమణికంఠ, కర్ణడి నాని, ఆకె టి రవి, గెద్దాడ పండు, మరియు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.