వాసంశెట్టి శ్రీలక్ష్మిని పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: ఐ పోలవరం మండలం, మురమళ్ళ గ్రామానికి చెందిన వాసంశెట్టి బాబ్జి మాతృమూర్తి శ్రీలక్ష్మి అనారోగ్యంతో సన్ రైజ్ హాస్పిటల్ కాకినాడలో చికిత్స పొందుతున్నారు. వారిని హాస్పిటల్ నందు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితుల గురించి డాక్టర్ ని అడిగి తెలుసుకున్న రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వీరివెంట కొప్పిశెట్టి గణేష్, దూడల స్వామి, పితాని రాజు, దంగేటి అబ్రహం, చెల్లుబోయిన బ్రహ్మానందం మొదలగువారు ఉన్నారు.