పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం సత్తమ్మ చెట్టు పిల్లి వారి గురువు గ్రామంలో గుండెపోటుతో మరణించిన యనమదల పద్మావతి కుటుంబ సభ్యులను పరామర్శించారు, పల్లంకురు శివారు గొల్లగురువు గ్రామంలో గిడ్డి ఏడుకొండలు భార్య దినకార్యంలో పాల్గొన్నారు. అనతరం పల్లంకురు గ్రామానికి చెందిన అకాల మరణం చెందిన పాయసం సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, పిల్లి గోపి, నూకల దుర్గబాబు, సలాది హరిబాబు ఉభయ గోదావరి జిల్లాల కమిటీ సభ్యురాలు ముత్యాల జై లక్ష్మీ, కడలి వెంకటేశ్వరరావు, బల్ల కుమార్, నూతన్ బాబు తదితరులు పాల్గొన్నారు.