ఆలమూరు, పినపళ్ల, కొత్తూరు సెంటర్లో విశాఖ ఉక్కుపై డిజిటల్ ఉద్యమానికి సంఘీభావం తెలిపిన బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండల కేంద్రమైన, ఆలమూరు గ్రామం నందు,ఆదివారం బస్టాండ్ సెంటర్ దగ్గర మహాత్మా గాంధీ విగ్రహం వద్ద, రాష్ట్ర జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుపై విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో, ఆలమూరు గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంగణం మారుమోగింది. రాష్ట్ర జనసేనాని ఇచ్చిన పిలుపుకు మద్దతుగా కొత్తపేట నియోజక వర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో పలువురు జనసైనికులు, కార్యకర్తలు, నాయకులు, వీర మహిళా కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపినారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బండారు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తగదని, రేపటి యువత భవిష్యత్తుకు, బంగారు బాటలు వేసే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తే యువతకు ఉద్యోగాలు ఎక్కడ నుంచి వస్తాయని, ఈ సందర్భంగా ప్రశ్నించారు.అంతే కాకుండా రాష్ట్రంలోని అధికార వైసిపిపార్టీ ఎంపీలను,ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎంపీలను విశాఖ ఉక్కు కొరకు ప్రైవేటీకరణ తగదని పార్లమెంట్లో ప్రశ్నించాలని, పోరాడాలని, జనసైనికులు తెలియజేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ లాంటి స్వార్ధం లేని నిజమైన నాయకుడు రాబోయే రోజులలో అధికారంలోకి వస్తే, రాష్ట్ర నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలరని, నిత్యావసర ధరలు తగ్గుతాయని, సామాన్యులు, పేద ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడానికి, బతకడానికి,రాష్ట్ర ప్రజల సమస్యలను జనసేనాని తీర్చ గలుగుతారని, మన రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి అని, రాజధాని సమస్యలను, ఇతర ప్రజా సమస్యలను, రైతు నాయకులు, రైతు కూలీల సమస్యలను తీర్చగలరని, నిజాయితీతో విలువలు కూడిన పరిపాలన అందించగలరని, రాబోయే రోజుల్లో జనసేనానిని ఆశీర్వదించాలని, ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అత్యంత ప్రముఖ సీనియర్ నాయకులు పలువురు తాళ్ల డేవిడ్, సంగీత సుభాష్, గారపాటి త్రిమూర్తులు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం తగదని, 25 మంది ఎంపీలు పార్లమెంటులో గట్టిగా మాట్లాడాలని, ఎంపీలను విశాఖ ఉక్కు పై నిర్లక్ష్యం వహించవద్దని తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర జనసేన నాయకులు, జిల్లా జాయింట్ సెక్రెటరీ తాళ్ళ డేవిడ్, జనసేన జిల్లా కార్యదర్శి సంగీత శభాష్ పినపల్ల సర్పంచ్, జనసేన నాయకులు పెద్దిరెడ్డి పట్టాభి పినపల్ల ఎం పి టి సి సభ్యులు, పెదపల్ల సీనియర్ జనసేన ప్రముఖ నాయకులు, గారపాటి త్రిమూర్తులు చౌదరి, సంగీత రామమూర్తి, ఆలమూరు మండల జనసేన అధ్యక్షులు సురపు సత్య, ప్రముఖ సీనియర్ జనసేన నాయకులు సలాది జయప్రకాష్ నారాయణ (జె పి), ప్రముఖ జనసేన నాయకులు కొనకళ్ళ ధనరాజ్ నాయుడు, బైరిశెట్టి రాంబాబు, నాగిరెడ్డి మణికంఠ, రఒకి రెడ్డి దీపు,శిరిగినీడి పట్టాభి, చల్లా వెంకటేశ్వరరావు, కోట వరలక్ష్మి, పల్లేటి అమ్ములు,లంకే సతీష్, అన్యం దుర్గారావు, మోటుపల్లి మణికంఠ, ముర కొండ భాస్కర్, సంగీత వీరబాబు, పల్లేటి ప్రసాదు, గుడివాడ నాగరాజు, పెద్దపాటి శివ, కుడుపూడి దుర్గాప్రసాద్, ఆలమూరు గ్రామజనసేన కమిటీ అధ్యక్షులు కట్టా రాజు, పసుపులేటి సాయిబాబా, యనమదల శ్రీనివాస్, కోట ధనరాజు, కుడుపూడి చిన్న శివ, కుడుపూడి పెద్ద శివ, సంగీత వీరబాబు, మురకొండ భాస్కర్, మోటుపల్లి సతీష్, నాగిరెడ్డి మహేష్ పలువురు నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, అన్ని వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో కొత్తపేట నియోజవర్గం జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ నాయకత్వంలో పాల్గొన్నారు.