జనసేనాని ఆశయం కోసం నడుం బిగించిన వాలంటీర్లను సత్కరించిన బండారు శ్రీనివాస్

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలోని, ఆలమూరు మండలం, జొన్నాడ గ్రామంనందు శనివారం కళ్యాణ మండపం వద్ద జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించిన వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. గత కొద్ది నెలల క్రితం, జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వాలు ఘనంగా నమోదు చేయించిన ప్రతి వాలంటీర్లకు కిట్లు పంపిణీ కార్యక్రమంతో పాటు, జనసేనాని కోరిక మేరకు ఎంతో ఘనంగా ఈ సన్మాన కార్యక్రమం చేపట్టడం ఎంతో అదృష్టమని, పార్టీ కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మాకు ఆప్తులని, జనసేన పార్టీలోకి, అన్ని వర్గాల వారికి స్థానం ఉంటుందని, జనసేనాని మంచి ఆశయానికి, నీతికి నిజాయితీకి నిలబడ్డ నాయకుడికి అండగా తరలిరావాలని అందరినీ ఆహ్వానిస్తున్నాము అని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్క జన సైనికులకు క్రియాశీల సభ్యత్వం నమోదు ద్వారా ఇన్సూరెన్స్ బీమా పథకం ఐదు లక్షల రూపాయలు పథకం వర్తించే విధంగా జనసేనాని గొప్పగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని, కార్యకర్తలు బాగోగులు చూసుకునే సేవకుడిగా, ఏలాంటి స్వార్థం లేని నాయకుడు జనసేనాని ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లకు ఘనంగా అభినందనలు తెలుపుతున్నామని, కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో జరిగిన మండల మీటింగ్ లో టీడీపీ వైస్సార్సీపీ పార్టీల నుండి దళిత సామాజిక వర్గం మరియు శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి సుమారు 300 మంది జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయినారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తాళ్ళ డేవిడ్, బొక్క ఆదినారాయణ, దొంగ సుబ్బారావు, సంగీత సుభాష్, లీగల్ సెల్ చోడిశెట్టి చంద్ర శేఖర్, ఆత్రేయపురం మండలం అధ్యక్షులు చేకూరి కృష్ణం రాజు, గారపాటి త్రిమూర్తులు, సలాది జయ ప్రకాష్ (జే పీ), మూలస్ధానం ఎంపీటీసీ బావిసెట్టి తాతాజీ, చొప్పేల్ల ఎంపీటీసీ జంపోలు చేముడులంక ఎంపీటీసీ తమ్మన భాస్కర్ రావు, బడుగువాని లంక ఎంపీటీసీ పడాల నాగలక్ష్మి అమ్మిరాజు, సందిపుడి ఎంపీటీసీ తొలేటి సంతోషి అంజిబాబు, మూలస్ధానం సర్పంచ్ లంక వర ప్రసాద్, తోట వేంకటేశ్వర రావు, కొత్తపల్లి నగేష్, నంబు రవి కుమార్, తోరటి అర్జున్, ఉండమట్ల దుర్గాప్రసాద్, నాగిరెడ్డి వెంకటేశ్వర రావు, విస్సా పుల్లయ్య, ఆలమూరు గ్రామ అధ్యక్షులు కట్టా రాజు, గుడాల నాగ బాబు, పెట్టా రంగనాథ్, లంకే సతీష్, బైర్రిశెట్టి రాంబాబు, పాలురి అర్జున్, నామాల సుబ్బారావు, చెల్లె ప్రేమ్ కుమార్, చల్ల వెంకటేశ్వర రావు, శిరిగినీడి పట్టాభి, పసుపులేటి సాయి బాబా, చామాకుర శ్రీనివాస్ మరియు వీరామహిళలు, కోటా వరలక్ష్మి, కొండేటి హేమ దేవి, జనసైనికులు పాల్గొన్నారు.