కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో వంగవీటి 76వ జయంతి వేడుకలు

గాజువాక: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపు కుల ఆరాధ్య దైవం, పేదల పాలిట పెన్నిధి, మడిమ తిప్పని పోరాటయోధుడు, స్వర్గీయ వంగవీటి మోహనరంగా 76వ జన్మదిన సందర్భంగా మంగళవారం 4 కాపు సంక్షేమ సేన ఆఫీసు నందు విశాఖ జిల్లా అధ్యక్షులు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి గుర్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయటం జరిగింది. అనంతరం సింహాచలం బస్ డిపో దగ్గర ఎంపీ జివిఎల్ నరసింహారావు చేతుల మీదుగా వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీ జీవీఎల్ తో పాటు కాపు సంక్షేమ సేన ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ గుర్రాల శ్రీనివాస్ మరియు కాపు సంక్షేమ సేన సభ్యులందరూ పాల్గొనడం జరిగింది.