బండి సంజయ్ వాహనంపై దాడి..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కాసేపట్లో ప్రారంభంకానుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఈసారి బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నగరంలోని 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నారు. 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు, 676 మంది ఇతరులు కలిపి మొత్తం 74,44,260 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఎర్పాట్లును పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఈసారి ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి 10 కరోనా కిట్లను, ఐదు శానిటైజర్ల సీసాలను సరఫరా చేశారు. ఓటర్లు క్యూలలో నిలబడేలా వృత్తాకారపు పరిధులు గీశారు. కరోనా నిర్ధారణ, అనుమానిత వ్యక్తులకు సైతం ఓటు హక్కు కల్పించేందుకు పోలింగ్‌ సమయాన్ని గంట పెంచారు.