అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడికి మనోధైర్యాన్నిచ్చిన బండ్రెడ్డి రామకృష్ణ

నూజివీడు జనసేన జన సైనికుడు నీలాపు ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతూ 2 కిడ్నీలు పాడయి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రసాద్ ని కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకుని నూజివీడు జనసేన పార్టీ తరుపున 25000 రూపాయలను ఆర్ధిక సహయం అందచేసి ప్రసాద్ కు మనోధైర్యం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు రెడ్డి మణి, నూజివీడు జనసేన నాయకులు మరీదు శివరామకృష్ణ, ముమ్మలనేని సునీల్ కుమార్, పాశం నాగబాబు, తుమ్మల జగన్ చట్రాయి జన సైనికులు, రామకృష్ణ హెల్పింగ్ హ్యాండ్స్ విజయవాడ సునీల్ తదితరులు పాల్గొన్నారు.