శశికళ విడుదలపై స్పష్టతనిచ్చిన బెంగుళూరు సెంట్రల్ జైలు

తమిళనాడు అమ్మ, మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ విడుదలపై బెంగుళూరు సెంట్రల్ జైలు స్పష్టత ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్థుల కేసు, అవినీతి ఆరోపణలపై శిక్ష పొందుతున్న జయలలిత ఆప్తురాలు శశికళ విడుదలపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. వాస్తవానికి ఆగస్టు నెలలోనే శశికళ విడుదలవుతున్నారంటూ వార్తలు రాగా.. తరువాత సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి బయటకు రానున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో బెంగుళూరు సెంట్రల్ జైలు అధికార్లకు ఓ వ్యక్తి ఆర్టీఐ పిటీషన్ ద్వారా వివరణ కోరాడు. దీనికి సంబంధించిన బెంగుళూరు సెంట్రల్ జైలు సమాధానమిచ్చింది.

జైలు రికార్డుల ప్రకారం జరిమానా రుసుము చెల్లించినట్లయితే 2021 జనవరి 27న విడుదల కావచ్చని…జరిమానా రుసుము చెల్లించకపోతే 2022 ఫిబ్రవరి 22న విడుదల కావచ్చని బెంగుళూరు సెంట్రల్ జైలు అధికారులు వెల్లడించారు.