గల్ఫ్‌లో భారత సంతతికి బాసట: ప్రధాని మోదీ భరోసా

గల్ఫ్‌లో భారతీయ సంతతి దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా సమయంలో గల్ఫ్‌లో చిక్కుకుపోయిన వేలాది భారతీయులను వందే భారత్‌ మిషన్‌ ద్వారా దేశానికి రప్పించామని చెప్పారు. గల్ఫ్‌ దేశాల్లో భారతీయులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశానని గుర్తు చేశారు. గల్ఫ్‌లో పనిచేస్తున్న భారతీయులందరికీ తమ ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు.

కేరళలో భారత్‌ పెట్రోలియంకు చెందిన రూ 6000 కోట్ల పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ను ప్రధాని ఆదివారం జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులతో భారత వృద్ధిని పరుగులు పెట్టిస్తాయని అన్నారు. గల్ఫ్‌ దేశాల్లో జైళ్లలో మగ్గిన భారతీయులను పలు గల్ఫ్‌ దేశాలు విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. గల్ఫ్‌ దేశాలు తన విజ్క్షప్తికి స్పందించి భారతీయ సంతతి పట్ల శ్రద్ధ కనబరిచాయని పేర్కొన్నారు.