పలు బాధిత కుటుంబాలకు బాసటగా బత్తుల

◆ ₹20,000/- రూపాయల ఆర్థిక సహాయం మరియు నాలుగు 25 కేజీల రైస్ బ్యాగ్స్ అందజేత.

రాజానగరం, ఎల్లప్పుడూ రాజానగరం నియోజకవర్గ ప్రజల శ్రేయస్సును కోరుకుంటూ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను అనునిత్యం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతూ మరోపక్క అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తూ తనదైన శైలిలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ఎందరో అభాగ్యులను ఆదుకుంటూ తమ సేవా తత్వాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గ ప్రజల మనస్సులు గెలుచుకుంటున్న పుణ్యదంపతులు, రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి.

◆ రాజానగరం మండలం, ‘నందరాడ’ గ్రామంలో జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న పలు కష్టాలను, సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారాలను సూచిస్తూ ఇదే సందర్భంలో పలు బాధిత కుటుంబాలను ఓదార్చి కొందరికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం ప్రజల పక్షాన నిలబడుతూ తమ సేవానిరతిని కొనసాగిస్తున్నారు.

◆ ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులైన ‘టేకుమూడి వీరబ్బాయి’ కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం చెప్పి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూపాయలు ₹5,000/- ఆర్థిక సాయం మరియు 25 కేజీల రైస్ బ్యాగ్ ను అందించడం జరిగింది.

◆ గ్రామవాసి ‘పీతల మునియ్య’ ఇటీవల పరమపదించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియపరుస్తూ కుటుంబ ఖర్చులు నిమిత్తం రూపాయలు ₹5,000/- ఆర్థిక సాయం మరియు 25 కేజీల రైస్ బ్యాగ్ ను అందించడం జరిగింది.

◆ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ‘గురజాడపు శ్రీను’ని పరామర్శించి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, తీసుకుంటున్న ట్రీట్మెంట్ పై ఆరా తీసి ధైర్యం చెప్పి వైద్య ఖర్చు నిమిత్తం రూపాయలు ₹5,000/- ఆర్థిక సాయం మరియు 25 కేజీల రైస్ బ్యాగ్ ను అందించడం జరిగింది.

◆ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇంటిపట్టునే ఉంటున్న ‘వాసంశెట్టి కామయ్య’ని పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై కోలుకుంటున్న విధానంపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని కుటుంబ ఖర్చుల నిమిత్తం రూపాయలు ₹5,000/- ఆర్థిక సాయం మరియు 25 కేజీల రైస్ బ్యాగ్ ను అందించడం జరిగింది.

◆ జనసైనికుడు ‘మేడిశెట్టి వెంకన్నబాబు’ కి ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో కాలికి ప్రమాదం జరగ్గా వారి ఇంటి వద్ద వారిని పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును కోలుకుంటున్న విధాన పై అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పడం జరిగింది.

ఈ పర్యటనలో మరో రెండు చోట్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులను అలానే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరి కొందరిని పరామర్శించి జనసేన పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిస్తూ ఈ కార్యక్రమం ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో బాదం రమణ, సూల సతీష్, సిక్కిరెడ్డి సత్తిబాబు, వాసంశెట్టి అప్పారావు, పల్లికొండ అప్పారావు, అడుసుమిల్లి హరికృష్ణ, పత్తిపాడు వెంకటరావు, వాసంశెట్టి వెంకన్న, వాసంశెట్టి కృష్ణ, లావేటి వెంకటరావు, దారా లక్ష్మణ్, ఓనం సుబ్బారావు, కడియాల కామరాజు మరియు శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, కొత్తపల్లి రఘు, వేగిశెట్టి రాజు, సుంకర బాబ్జి, కమిడి సత్యనారాయణ తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.