సీతానగరం రోడ్డు పరిస్థితిపై ధ్వజమెత్తిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, వైసిపి దాష్టిక దుర్మార్గపు పాలనా చర్యలను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమంలో బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ పేరుకు మాత్రం రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం అని గొప్పలు చెప్పుకునే నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ రోడ్డుని పట్టించుకున్న నాధుడు లేడని రోడ్డు వేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న అధికార పార్టీ నేతలు సీతానగరం మండలాన్ని ఆర్థికంగా వెనుకబడిన గల్ఫ్ దేశాల కన్నా అద్వాన స్థితికి తీసుకొస్తున్నారు. శిధిలమైన దేశాలను మించిన రోడ్లు సీతానగరంలో కనిపిస్తున్నాయని బత్తుల మీడియా వేదికగా తెలియజేశారు. అభివృద్ధి అనేది కాగితాల మీద తప్ప వాస్తవంలో లేదని ఈ అధికార పార్టీ చేతగానితనాన్ని ప్రజలంతా వ్యతిరేకించాల్సిన సమయం వచ్చిందని బత్తుల తెలియజేశారు. వైద్య సహాయాలు అత్యవసర పరిస్థితుల్లో రాజమండ్రికి వెళ్ళాలన్నా గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిరు వ్యాపారులు చిన్నచిన్న ఉద్యోగాల నిమిత్తం రాజమండ్రి వెళ్లి వచ్చే వాళ్ళకి తీవ్రత ఆటంకం కలుగుతుంది. ఉద్యోగానికి వెళ్లి రావడం పక్కన పెడితే మార్గమధ్యంలో ఈ రోడ్ల దుస్థితి ద్వారా ఆక్సిడెంట్లకు గురై ఎంతోమంది అవస్థ పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సీతానగరం రోడ్డు మీద దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్నా సీతానగరం మండలం ఇప్పుడు ఈ పరిస్థితికి రావడం చాలా బాధాకరమని బత్తుల బలరామకృష్ణ అన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన సీతానగరం మండలం ఇప్పుడు ఆధునిక ప్రపంచానికి రోజురోజుకీ దూరమవడానికి కారణం ఈ ప్రభుత్వమని బత్తుల గంటాపదంగా తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు నిమిత్తం వారి రవాణా సౌకర్యం కోసం పెద్ద పెద్ద బండలను తీసుకొని ఈ రోడ్లమీద వేస్తున్నారు వాటి వల్ల ద్విచక్ర వాహనదారులకు ఎంతో ప్రమాదం పొంచి ఉంది దీన్ని అధికారులు గుర్తించాలని తెలియజేశారు. ఎంతో చేస్తాం, అన్ని చేస్తాం అని స్థానిక ఎమ్మెల్యే గొప్పలకు పోయి ఇప్పుడు వీరిని ఎన్నో విధాలుగా క్షోభకు గురిచేస్తున్నారు. నలుమూలల మన గ్రామాల్లో ప్రజలు రోడ్ల వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్ల వలన ఎంతో మంది క్షతగాత్రులు, గర్భాన్ని కోల్పోయిన మహిళలు వాళ్ళందరూ సోకాన్ని ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుంది అని బత్తుల తెలిపారు. రాబోయే రోజుల్లో జనసేన ద్వారా సీతానగరం మండలానికి మంచి రోజులు రాబోతున్నాయి అని ప్రజలంతా ధీమాగా ఉండాలని ప్రతి అంశాన్ని మనమే చక్కదిద్దుకుంటామని బత్తుల ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ చేస్తున్న దుష్ట చర్యలను జనసైనికులు ఎప్పుడూ తిప్పికొడతారని కోడి కత్తిలాంటి డ్రామాలకు రోజా లాంటి బాణాలకు తొందర్లోనే చరమగీతం పాడతామని బత్తుల ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్ని ఆటంకాలు తలపెట్టిన వైసిపి పవన్ కళ్యాణ్ నీడని కూడా తాకలేదని షెడ్యూల్ ప్రకారం ఈరోజు వరకు పవన్ కళ్యాణ్ విశాఖలో ఉండి ఇప్పుడు విజయవాడ వెళ్లారు. పవన్ కళ్యాణ్ గోడకు కొట్టిన బంతిలా అంతకంతకు ఎదిగే వ్యక్తి తప్ప తగ్గే వ్యక్తి కాదని వైసిపిపై ఇకపై దండయాత్ర కొనసాగుతుందని బత్తుల స్పష్టం చేశారు. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారని తొందరలోనే ఈ దాష్ట్క పాలన అంతమై స్వచ్ఛమైన పరిపాలన జనసేన ద్వారా ప్రజలు పొందుతారని బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, మట్ట వేంకటేశ్వర రావు, మద్దిరెడ్డి బాబులు, బప్పిరెడ్డి దుర్గారావు, వేగిశెట్టి రాజు, అడ్డాల దొరబాబు, అరిగెల రామకృష్ణ, చిట్టిప్రోలు సత్తిబాబు, రుద్రం గణేష్, నేడురి పొసియ్య, నెడురి విఘ్నేష్, కరుణాకర్, రావూరి దుర్గా ప్రసాద్, చిక్కమ్ నాగేంద్ర, కొనే శ్రీను, రోంగలి అభిరామ్, ప్రగడ శ్రీహరి, కోణాల దుర్గా ప్రసాద్, మూర్తి, కవల సురేష్, మానేపల్లి నాగేంద్ర, రుద్రం కిషోర్, రుద్రం నాగు, నేదురి పోసి, దులం పండు, నేదురీ విఘ్నేష్, ఇంటి దుర్గా ప్రసాద్, రుద్రం సూర్య గణేష్, నేదూరి సతీష్, రుద్రం గణేష్, ప్రగడ బుల్లి, బోడపాటి కరుణాకర్, రుద్రం వెంకటేష్, తన్నీరు సూర్య గణేష్, రావూరి దుర్గా ప్రసాద్, రుద్రం నగేష్, నగా రామ దుర్గా, తుమ్మలపల్లి శ్రీనివాస్, పోతుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.