కొండగుంటూరు అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల దంపతులు

  • జనసెన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు
  • కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, దేవి నవరాత్రులు సందర్భముగా కొండ గుంటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ సందర్భంగా విచ్చేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయంలో జనసెన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించారు బత్తుల దంపతులు. అన్న సమారాధన కార్యక్రమానికి బత్తుల దంపతులు 5,000/- రూపాయల విరాళాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరిగెల రామకృష్ణ, జగత వీరభద్రరావు, కొప్పిరెడ్డి బాబి, ఆనెంవీరభద్ర ‌స్వామి, పల్ల స్వామి, మేడిశెట్టి సాయి, గిరిజాల మణి, కూరపాటి వెంకన్నబాబు, సోడసాని మనీష్ కుమార్, అగర్తి రాజిని కాంత్, సలాది రమేష్ తదితరులతో పాటు కొండ గుంటూరు గ్రామ ప్రజలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.