కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి త్యాగలకైనా సిద్ధం

  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, సమాజంలోని చెత్తా చెదారాన్ని తీసేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించేందుకు నిరంతరం శ్రమించే కార్మికుల, కర్షకుల సమస్యల్ని పరిష్కరించే క్రమంలో చేసే పోరాటంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుటుందని వారి సంక్షేమం కోసం ఎలాంటి త్యాగలకైనా సిద్ధంగా ఉంటామని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన ఏడు నెలలుగా ఆగిన ఆరోగ్యభత్యాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలలుగా ఆగిపోయిన ఆరోగ్య భత్యం విడుదల కోసం కార్మికుల పక్షాన పోరాడిన ఆళ్ళ హరిని శనివారం కార్మిక సంఘాల నాయకులు రెల్లి యువత రాష్ట్ర నాయకులు సోమి ఉదయ్ నేతృత్వంలో, కార్మికులు దుశ్శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రపంచంలో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కానీ నిరంతరం శ్రమించే కార్మికుల సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పడ్డ కష్టానికి రావాల్సిన ప్రతిఫలం కోసం కూడా నెలలు నెలలు పోరాడాల్సి రావటం దురదృష్టకరం అన్నారు. కార్మికుల్లోని అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కార్మికుల కష్టాన్ని దోచుకునే కొన్ని పార్టీల, కొంతమంది యూనియన్ నాయకుల ఆటలు ఇక చెల్లవన్నారు. కార్మికులు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారానికై జనసేన పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరంతరం కార్మికుల సంక్షేమం, భద్రత గురించే ఆలోచిస్తారని ఆళ్ళ హరి అన్నారు. ఈ కార్యక్రమంలో సోమి ఉదయ్ కుమార్, ముత్యాల వెంకటేశ్వర్లు, కే విజయ్, బంగార్రాజు, సతీష్, షర్ఫుద్దీన్, బాషా, దొంత నరేష్, వడ్డె సుబ్బారావు, తేజ తదితరులు పాల్గొన్నారు.