Mummidvaram: దొంతుకుర్రు గ్రామంలో బూల రాజు కుటుంబానికి బాసటగా పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జి, రాష్ట్ర PAC సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ తుఫాన్ వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాట్రేనికోన మండలం దొంతుకుర్రు గ్రామంలో బూల రాజు కుటుంబం నివసించే గృహం కూలిపోవటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర జనసేనపార్టీ PAC సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పితాని బాలకృష్ణ ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి 25 కేజీల బియ్యం, కిరాణా సామాన్లు, కట్టుకోవడానికి బట్టలు, దుప్పట్లు, అదే విధంగా 5000 రూపాయల నగదు బాధిత కుటుంబసభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల పాడైపోయిన ఇళ్ళు, అలాగే వరి పంట పొలాలకు అధికారులను పంపి సర్వే చేయించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం బాధితులకు పరిహారం అందచెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, మండల జనసేనపార్టీ కన్వీనర్ మోకా బాలప్రసాద్, మండల ఉపాధ్యక్షులు కాయల బలరాం, మండల కార్యదర్శి సంసాని పాండు రంగారావు, మండల ప్రచార కార్యదర్శి అడపా సాయి, మండల కోశాధికారి గిడ్డి రత్నశ్రీ, మండల కార్య నిర్వాహక కార్యదర్శి భీమాల సూర్యనాయుడు, మండల కార్యనిర్వాహక సభ్యులు లక్ష్మీ నారాయణ, మచ్చ శ్రీను, గుర్రాల బాలరాజు, అదేవిధంగా జనసేన నాయకులు గోదాసి పుండరీష్, దూడల స్వామి, నూకలు దుర్గబాబు, చంటి బాబు, ఓగురి భాగ్యశ్రీ, నూతనబాబు, కడలి వెంకటేశ్వరరావు, రాజా జనసేనపార్టీ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.