బీట్స్ ఆఫ్ ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థలు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. అక్టోబర్23 ఈ రోజు ప్రభాస్ బర్త్ డే కానుకగా రాధే శ్యామ్ దర్శక నిర్మాతలు మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ విక్రమాదిత్యగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోషన్ పోస్టర్ విడుదల చేశారు. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమికులు దేవదాస్, పార్వతి.. లైలా మజ్ను ఫోటోల మీదుగా ఓ ట్రైన్ లో ఈ మోషన్ పోస్టర్ సాగుతుంది. చివరగా ప్రభాస్, పూజ హెగ్డే జోడి కనిపిస్తుంది. ఈ ప్రేమకథ కూడా అంత గొప్పగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ప్రతి సినిమాకి తన హ్యాండ్ సమ్ లుక్స్, స్టైలిష్ మేకోవర్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు రాధేశ్యామ్ లో కూడా అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్ తోనే సినిమా స్థాయి అర్థం అయిపోతుంది. బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న రెబల్‌ స్టార్ ప్రభాస్ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. “రెబల్‌స్టార్” ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది.