తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈరోజు నుంచి ఈనెల 23 వరకు నామినేషన్లు అధికారులు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఎమ్మెల్సీ నియోజక పరిధిలో 5.60 లక్షల ఓటర్లు ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మూడవ అంతస్తులో ఉన్న రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలాకి అభ్యర్థులు నామినేషన్‌ను అందించనున్నారు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చిన్నారెడ్డి తొలి నామినేషన్‌ను వేశారు.