ద్వారంపూడి తస్మాత్ జాగ్రత్త..!!

  • సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు
  • జనసేనాని లెక్కలు మాత్రమే తేల్చారు, పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే జనసైనికులు నీ మక్కెలు విరుస్తారు

సత్తెనపల్లి: కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు మండిపడ్డారు. మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ.. జనసేనాని లెక్కలు మాత్రమే తేల్చారు, పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే జనసైనికులు నీ మక్కెలు విరుస్తారు, ముందు నువ్వు పవన్ కళ్యాణ్ అడిగిన లెక్కలకు సమాధానం చెప్పు, పవన్ కళ్యాణ్ ని కొనేంత దమ్ము దేశంలో ఎవరికుంది రా… ? పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నమ్మిన వారందరూ ఆయన వెంటే ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా జనసేనానితోనే మా పయనం. స్థాయికి మించి మాట్లాడితే ఎమ్మెల్యే ద్వారంపూడికి బుద్ధి చెబుతామని బొర్రా హెచ్చరించారు.