హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలి: కేజ్రీవాల్

భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ఈ ఏడాది భారతీయ వైద్యునికి ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘భారతీయ డాక్టర్’ అర్థాన్ని వివరిస్తూ, అందరు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది దీని పరిధిలోకి వస్తారన్నారు.

కేజ్రీవాల్ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ఈ ఏడాది భారతీయ వైద్యునికి ‘భారత రత్న’ ఇవ్వాలన్నారు. అందరు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ‘భారతీయ వైద్యుడు’ అర్థ పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. ప్రాణ త్యాగం చేసిన వైద్యులకు ఇది నిజమైన శ్రద్ధాంజలి కాగలదని పేర్కొన్నారు. తమ ప్రాణాలు, కుటుంబాల పట్ల ఆందోళన లేకుండా, సేవలందించినవారిని గౌరవించినట్లవుతుందన్నారు. అంతేకాకుండా యావద్భారత దేశం సంతోషిస్తుందన్నారు.

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో వైద్యులు పోషించిన పాత్రను ప్రశంసించారు.

కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం సమయంలో 798 మంది డాక్టర్లు ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *