ఎస్పీబీకి భారతరత్న ఇవ్వాలి

ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు ఏపీ సీఎం జగన్‌. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసిన జగన్‌. తన జీవితకాలం పాటు సంగీత రంగంలో విశేష కృషి చేసిన బాలు సేవలకు గుర్తుగా దేశ అత్యున్నత పౌరపురస్కారం భారత రత్న ఇవ్వాలని ప్రధానిని జగన్ కోరారు. జగన్ రాసిన లేఖపై స్పందించారు ఎస్పీ చరణ్. తన తండ్రికి భారతరత్న ఇస్తే సంతోషిస్తాం అని తెలిపారు.

55 సంవత్సరాల పాటు వేల పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీబీ. 16 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడిన బాల సుబ్రహ్మణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయిన పాట రూపంలో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. ఈ నేపథ్యంలో ఎస్పీబీకి భారతరత్న ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.