హిందూవులకు భరత్ క్షమాపణలు చెప్పాలి: కిరణ్ రాయల్

తిరుపతి: రాజమండ్రి ఎంపీ జగన్మోహన్ అంటే దేవుడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, భవిష్యత్తులో దేవుడి విగ్రహాలు తొలగించి జగన్ విగ్రహాలు పెడతారెమో అని, భవిష్యత్తులో జగన్ ను తిట్టకూడదనే జీవో తీసుకొని వస్తారేమోనని, అసలు రాజమండ్రి ప్రజలు ఇలాంటి వారిని ఎలా ఎన్నుకున్నారో అర్థం కావడం లేదని ఖచ్చితంగా భరత్ ను పిచ్చాసుపత్రికి తరలించాలని, హిందువుల పేర్లు దేవుడి పేర్లతో కలసి ఉంటాయని, జగన్మోహన్ అంటే దేవుడైతే మా అధ్యక్షుడు కూడా పవనుడు కనుక ఆయన కూడా దేవుడేకదా అని, తక్షణమే హిందువులకు మార్గని భరత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జీ, హేమ కుమార్, రాజమోహన్, మునస్వామి, రమేష్, కిషోర్, హేమంత్, వంశీ, సుజిత్, రాజేంద్ర తదితరులతో కలిసి కిరణ్ రాయల్ భరత్ ను ఉద్దేశించి చురకలు విసిరారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా తక్షణమే టిటిడి చైర్మన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాజిక సాధికారత పాదయాత్ర పేరిట ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి లో ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారని, ముఖ్యమంత్రి తిరుపతికి, ప్రజలకు ఏం చేశారో చెప్పలేక పోయారని, వైకాపా నాయకులు ఇప్పుడు ఎన్ని యాత్రలు చేసినా వారికి కాశీయాత్ర తప్పదని, ఎంపీ మాధవ్ వ్యాఖ్యలతో చంద్రబాబు భద్రత ప్రశ్నార్థకంగా మారిందని రాజా రెడ్డి ప్రశ్నించారు.