300 పోస్టులకు BHEL నోటిఫికేషన్

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ (భెల్‌) భోపాల్‌ 2021-22 సంవత్సరానికి ఐటీఐ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్రెంటిస్‌ పోస్టుల్లో సుమారు 300 ఖాళీల భర్తీకి దరఖాస్తులకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఆసక్తిగల అభ్యర్థులు 2021 ఫిబ్రవరి 22 లోపు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని BHEL  సూచించింది.

ఖాళీల వివరాలు:

ఎలక్ట్రీషియన్‌ – 80 పోస్టులు

ఫిట్టర్‌ – 80 పోస్టులు

మెషినిస్ట్‌ కాంపోజిట్‌ – 30

వెల్డర్‌ – 20 పోస్టులు

టర్నర్‌ – 20 పోస్టులు

కంప్యూటర్‌ – 30 పోస్టులు

డ్రాఫ్ట్స్‌ మెన్‌ (మెకానిక్‌) – 5 పోస్టులు

మెకానిక్‌ మోటారు వాహనం – 5 పోస్టులు

మెషినిస్ట్‌ (గ్రైండర్‌) – 5 పోస్టులు

తాపీ పని (మాసన్‌) – 5 పోస్టులు

పెయింటర్‌ (జనరల్‌) – 5 పోస్టులు

వడ్రంగి – 5 పోస్టులు

దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 22. 2021

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ పాస్, సంబంధిత ట్రేడ్స్ నుండి ఐటిఐ డిప్లొమా కోర్సు చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వు చేసిన వర్గాలకు గరిష్ట వయోపరిమితి నుండి మినహాయింపు ఉంటుంది.

పూర్తి వివరాలకు www.bhel.com ను సంప్రదించాలని బీహెచ్‌ఈఎల్‌ సూచించింది.