ఆత్మకూరు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా భీమ్లా నాయక్ చిత్రం విడుదల వేడుకలు

ఆత్మకూరు, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం విడుదల సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ జనసైనికులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి ఆత్మకూరు పార్టీ కార్యాలయం నుండి సినిమా హాలు వరకు తీన్మార్, బాణాసంచాలు మరియు జై జనసేన అనే నినాదాలతో ఊరేగింపుగా వెళ్లి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ… భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి యువశక్తి ఒక్క జనసేన పార్టీకె సొంతమని జనసైనికులు లేకపోతే జనసేన పార్టీ లేదని కొనియాడుతూ ఈ సందర్భంగా వారికి ఆత్మకూరు జనసేన పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.