సర్వేపల్లిలో భీమ్లా నాయక్ విజయోత్సవ వేడుకలు

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విజయవంతం అయిన సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు మధ్య అంగరంగ వైభవంగా బాణాసంచా కాల్చి, ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా సర్వేపల్లి గ్రామం నందు సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయం పక్కన జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు షేక్ రహీమ్ భాయ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా సురేష్ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చిత్రం విడుదలయి విజయం సాధించడం పట్ల జనసైనికులు అందరూ ఆనందంగా విజయోత్సవం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ అవన్నీ దాటుకొని పవన్ కళ్యాణ్ సినిమా విజయం సాధించడం మాకు ఎంతో గర్వంగా ఉంది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధిస్తామని పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ జనసేన పార్టీ జెండాని పల్లెపల్లెన ఎగరేస్తాం అని మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ పొలం రెడ్డి ఇందిర రెడ్డి, గూడూరు జనసేన పార్టీ నాయకులు చిరంజీవి యువత అధ్యక్షులు నయం, పినిశెట్టి మల్లికార్జున్, రవికుమార్, సందీప్, బుచ్చి మండల ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, సురేంద్ర, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.