భోగి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలి

సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటుతున్న వేళ ప్రజలందరికీ ప్ర‌ధాని మోదీ  భోగి పండుగ‌ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌ధాని తెలుగులో భోగి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.