ఫుల్ జోష్‌లో బైడెన్.. 3 రోజుల్లో 30 ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అధికారం చేపట్టిన మూడు రోజుల్లోనే ఆయన 30 ఆదేశాలపై సంతకాలు చేశారు. ట్రంప్ విధానాలను శరవేగంగా ఆయన రద్దు చేస్తున్నారు. కరోనా వైరస్ సంక్షోభం నుంచి బయటపడడమే కాకుండా.. ట్రంప్ విధానాలను రద్దు చేసేందుకు బైడెన్ ఉత్సుకత చూపిస్తున్నారు. 30 ఎగ్జిక్యూటివ్ ఆదేశాల్లో.. బోర్డర్ గోడ నిర్మాణం కోసం నిధులను నిలిపివేయాలని ఆదేశించారు. ముస్లిం దేశాలపై ఉన్న ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయడం.. మాస్క్ తప్పనిసరి లాంటి ఆదేశాలు ఉన్నాయి. ట్రంప్ రూపొందించిన సుమారు పది విధానాలను రివర్స్ చేస్తూ బైడెన్ ఆదేశాలు ఇచ్చారు.