ఎప్పటికీ మర్చిపోలేని క్షణం.. బిన్ లాడెన్‌ మృతిని తలచుకొన్న బైడెన్

ప్రపంచం మొత్తాన్ని వణికించిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మరణించి పది సంవత్సరాలైంది. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్ అలనాటి రెయిడ్‌ను గుర్తుచేసుకున్నారు. అమెరికా మిలటరీ పాకిస్తాన్‌లో చేపట్టిన మిషన్‌లో భాగంగా.. ఆల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టారు. లాడెన్‌కు ఎప్పుడో వేయాల్సిన శిక్షను ఆ రోజున వేశామని బైడెన్ చెప్పారు. ఆ క్షణాన్ని తాను ఎప్పుడూ మర్చిపోబోమనని తెలిపారు. ”ఇప్పడు అఫ్ఘానిస్తాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి కూడా తెరదించనున్నాం” అని బైడెన్ వివరించారు.

కాగా, అమెరికాలో వరల్డ్ ట్రేట్ సెంటర్‌పై దాడి చేయించింది లాడెనే. ఈ దాడిలో చాలామంది మరణించారు. దీంతో ఆగ్రహం చెందిన యూఎస్.. లాడెన్‌పై దాడులు ప్రారంభించింది. అయితే అక్కడి పరారైన లాడెన్ పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు. 2011లో పాకిస్తాన్‌లో చేపట్టిన ఆపరేష్‌లో యూఎస్ బలగాలు లాడెన్‌ను మట్టుబెట్టాయి.