మయన్మార్ రక్తపాతంపై స్పందించిన బైడెన్‌..

వాషింగ్టన్‌: మయన్మార్‌లో జరుగుతున్న రక్తపాతం అత్యంత దారుణం, భయంకరమని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. ఒకే రోజు మయన్మార్ సైన్యం 100 మందికిపైగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. గత నెల 1న ఆంగ్ సాన్ సూకీపై తిరుగుబాటు చేసి దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న అక్కడి సైన్యం.. అప్పటి నుంచీ దీనికి ఎదురుతిరిగిన వారిని పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపుతోంది. ఈ రక్తపాతంపై స్పందించిన బైడెన్‌.. ఇది భయానకం అని అన్నారు. అనవరసంగా వందలాది మంది పౌరులను చంపినట్లు తనకు అందిన సమాచారం మేరకు తెలిసిందని బైడెన్ చెప్పారు. మయన్మార్‌లో జరుగుతున్న రక్తపాతంపై మీడియా అడిగిన ప్రశ్నలకు బైడెన్ స్పందించారు.