జగమేలే జనసేనానికి జన్మదిన వేడుకలు

మంథని నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినము సందర్బంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అతి పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానా గర్భగుడిలో పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని గోత్రనామాలతో అభిషేకము చేేయించి పూజలు నిర్వహించడం జరిగింది. మంథని నియోజకవర్గం ఇన్చార్జి మాయ రమేష్ పిలుపు మేరకు మహాదేవపూర్ లో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. అనంతరం మహాదేవపూర్ మండల అధ్యక్షుడు కాల్వ రాజశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఏదైతే ఆశ సిద్ధాంతాలతో ముందుకెళ్తుందో అదే స్ఫూర్తితో జనసేనాని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకువెళ్లి సమాజంలో మార్పు వచ్చేలా కృషి చేస్తాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను అతి తక్కువ సమయంలోనే నెరవేర్చాలని కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు అనే ఆయుధాన్ని కల్పించి బానిసత్వని అంతం చేయాలి అని అన్నారు. మరొక మహాయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆనాడు ఆనాటి ఆ కాలంలోనే దేశ రక్షణ కోసం దేశంలో ఉన్న ప్రజలను కాపాడడం కోసం ఆజాద్ హిందూపౌస్ అనే ఐ.ఎన్.ఏ సంస్థను స్థాపించాడు. ఆ కాలంలో దేశం బయట ఉన్న వాళ్ళ పైనే అంత శ్రద్ధ పెడితే మరి దేశం లోపల ఉన్న అవినీతి రాజకీయ నాయకులను అంతం చేయడానికి పెట్టిన పార్టీనే మన జనసేన పార్టీ అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పోలోజ్ ఆవీనస్, జనరల్ సెక్రెటరీ శేషోజ్వాల రాజేష్, రామ్ శెట్టి రాకేష్, నారా రవికాంత్, బుర్రి రాకేష్, చిర్ర రాకేష్, షేక్ దిన్ కలుగూరి విజయ్, కడార్ల రాజేష్, భూపాలపల్లి జిల్లా నాయకులు బీరెల్లి సుమన్, పైడిమల్లి రాజు, కాటారం మండల నాయకులు జనగాం పవన్, చిలుముల శివ ప్రసాద్, మహా ముత్తారం మండల నాయకులు విజ్జగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.