తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన మద్దతుతో బరిలో బీజేపీ…

తిరుపతి ఉప ఎన్నికకు ఇప్పటికే నగారా మోగింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే, మొదటి నుంచి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటిస్తూ వస్తున్నది. అవసరమైతే ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిసి ఒప్పిస్తామని జనసేన వర్గాలు పేర్కొన్నాయి. తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకు ఎక్కువ బలం ఉందని, జనసేనకు అవకాశం ఇస్తే తిరుపతి సీటును గెలుచుకుంటామని చెప్తూ వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థి ఎవరూ అనే దానిపై కసరత్తు చేసేందుకు ఈరోజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ ఇంచార్జ్ సునీల్ డియోదర్ లు సమావేశం అయ్యారు. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం బీజేపీ కి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి జనసేన మద్దతు ఇస్తున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, బీజేపీ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారు అన్నది పార్టీ ప్రకటించాల్సి ఉన్నది.