బిజెపి-జనసేన కలయిక తెలంగాణ రాష్ట్రంలో ఒక శక్తిలా ఎదుగుతుంది: అర్.కె నాయుడు

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, కె.పి హెచ్. బి.కాలనీ, రోడ్డు నెంబర్ -1, గాంధీ విగ్రహం దగ్గర నుండి ముందుగా గాంధీ విగ్రహముకు పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించి, శుక్రవారం సాయంత్రం భారీ ర్యాలీతో పాదయాత్రను ప్రారంభించిన బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, జనసేన ప్రచార కార్యదర్శి, మరియు బుల్లితెర నటులు ములుకుంట్ల సాగర్ (ఆర్.కె నాయుడు) గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ధనలక్ష్మి టిఫిన్ సెంటర్, రోడ్ నెంబర్ 2 ఆంజనేయస్వామి టెంపుల్, మధుసూదన హాస్పిటల్, ఆర్.ఆర్ చికెన్ సెంటర్, రెమిడి హాస్పిటల్, టెంపుల్ బస్ స్టాప్ వరకు కార్యకర్తల నినాదాలతో పాదయాత్ర కొనసాగింది. ఆనంతరం ఆయన మాట్లాడుతూ సోదరుడు మనందరి ఇష్టమైన నటులు సాగర్ కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు మద్దతుగా రావడం ఆనందం కలిగించే విషయం అని అన్నారు. బిజెపి-జనసేన పట్ల మీకున్న అభిమానం చూస్తుంటే ఖచ్చితంగా కూకట్పల్లి నియోజకవర్గం గెలవడం ఖాయం అని అన్నారు. బిజెపి నాయకులు, జనసేన నాయకులు కలిసి పని చేద్దాం అవినీతిని పరద్రోలుదాం. బిజెపి-జనసేన కలయిక తెలంగాణ రాష్ట్రంలో ఒక శక్తిలా ఎదుగుతుంది. కూకట్పల్లి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, అవి పరిష్కరించాలంటే అవినీతి లేని నాయకుడు గెలవాలి. మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి ఈసారి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, జనసేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మాజీ అధ్యక్షులు సోమువీర్రాజు, శ్రీకర్ రావు, షాజహాన్, గంధం రాజు, ప్రితం రెడ్డి, కొల్లా శంకర్, రాజేష్, ప్రసాద్, బిజెపి నాయకులు, జనసేన నాయకులు, మహిళా నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.