బీజేపీనేత యాళ్లను అయితా బత్తుల

కోనసీమ జిల్లా, అమలాపురం అసెంబ్లీ తెలుగుదేశం-జనసేన-బీజేపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు, బిజెపి జిల్లా అధ్యక్షులు యళ్ళ దొరబాబును శనివారం బెండమూర్లంకలో ఆయన స్వగృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. అమలాపురం నియోజకవర్గంలో బిజెపి -టిడిపి -జనసేన కూటమిలో భాగంగా ఆనందరావు కు తమ పూర్తి మద్దతు ఉంటుందని దొరబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లవరం మండల టిడిపి అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబు రాజు, అల్లవరం మండల బిజెపి అధ్యక్షులు సుంకర సాయి, డేగల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.