భగత్ సింగ్ కు ఘన నివాళులు

తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవబట్ల విజయ్ ఆధ్వర్యంలో భారతమాత ముద్దు బిడ్డలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల త్యాగాలను షహీద్ దివాస్ సందర్భంగా స్మరించుకుంటూ వారి స్మృతికి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ మాట్లడుతూ భారతదేశ చరిత్రలో 1931 మార్చి 23 ఓ విషాద దినం అని, మన దేశం కోసం ఆ ముగ్గురు భారతదేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి అమరులయ్యారు. ప్రతి ఒక్క భారతీయుడు ఈ ముగ్గురు యోధులకు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజూ నివాళులు అర్పించాలి. ఎందరో మహనీయులు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే మనం ఈరోజు స్వేచ్ఛ సమానత్వం అనుభవిస్తున్నాము అని అన్నారు తుమరాడ చిన్న మాట్లాడుతు భారత బానిస సంకెళ్లు తెంచడం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన మహనీయులు వారు అని 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం పై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి ‘జె.పి. సాండర్స్’ ను హతమార్చినందుకు 1931 మార్చి 23న ఉరిశిక్షకు గురయ్యారు అని అంతేకాకుండా జైల్లో ఉన్నప్పుడు కూడా భగత్ సింగ్ ఉద్యమాలు చేయడం ఆపలేదు అని బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు అని “ఇంక్విలాబ్ జిందాబాద్!” అని నినదించింది భగత్ సింగ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అత్తిలి బాబి ఇమ్మంది బెనర్జీ సందక రమణ బైరెడ్డి కొండయ్య తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.