వైరా నియోజకవర్గ అభివృద్ధి కొరకై వస్తున్నా ఆశీర్వదించండి: డా.సంపత్ నాయక్

తెలంగాణ, వైరా మండలం రెబ్బవరం గ్రామంలో బిజెపి మద్దతు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.సంపత్ నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ నాయక్ మాట్లాడుతూ జనసేన-బిజెపి ప్రభుత్వ ఏర్పాటు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులకు ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ అన్న పార్టీ “గాజు గ్లాస్ గుర్తు” కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, బిజెపి ముఖ్య నాయకులు, ఐదు మండలాల అధ్యక్షులు మండల, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.