రక్తదాతలు నవజీవన స్ఫూర్తి దాతలు: వాసగిరి మణికంఠ

గుంతకల్, అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సేవ స్ఫూర్తితో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంతకల్ పట్టణ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణం గోపి బ్లడ్ బ్యాంక్ నందు “మెగా రక్తదాన శిబిరం” విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ అభిమాన హీరో అల్లు అర్జున్ ఆలోచనలను, ఆశయాలను పుణికిపుచ్చుకొని సమాజ సేవ చేయడంలో అల్లు అభిమానులు ఎప్పుడూ ముందుంటారని అందుకు ఉదాహరణ ఈ “రక్తదాన శిబిరం” అని, భగభగ మండే సూర్యుని సైతం లెక్కచేయకుండా రక్తదాన శిబిరంలో సుమారు ’60’ మంది యువకులు ఎంతో సామాజిక బాధ్యతతో రక్తం దానం చేయడమే ఇందుకు గొప్ప నిదర్శనం అని కొనియాడారు. అల్లు అర్జున్ గొప్పతనం గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోరిక మేరకు అమలపాడు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆ గ్రామ ప్రజలకి దాహార్తిని తీర్చడం, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతూ మరణించిన అభిమానుల విషయంలో, మొట్టమొదటగా స్పందించి వారి కుటుంబాలకి ఆర్థిక సహాయం ప్రకటించడం. 2019 ఎలక్షన్స్ ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం బాగోక పొతే, డైరెక్ట్ గా పాలకొల్లు బహిరంగ సభా వేదిక వద్దకు వచ్చి పరామర్శించి నైతిక మద్దతు తెలపడాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఎప్పటికీ మర్చిపోరని, ఇన్ని గొప్ప పనులుచేసిన ఒక వ్యక్తిని, గౌరవించి అభిమానించడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి గోపి, రాష్ట్ర సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, సీనియర్ అభిమానులు గాజుల రఘు, చికెన్ మధు. అల్లు అర్జున్ అధ్యక్షుడు రవికుమార్, అల్లు నాసిర్, అల్లు హరీష్ , హోన్నర్, వెంకీ, మనోజ్, శీనా, అంజి, సాయి, యువరాజె, బన్నీ సాయి, చోటు, సూరి, హరి కసాపురం నిఖిల్ అజయ్, శీన, విరేష్, అంజి, బన్నీ, సాయి తదితరులు పాల్గొన్నారు.