అగ్నిప్రమాద బాదిత కుటుంబాలను పరామర్శించిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలంలోని మహాలక్ష్మిపురం నందు అగ్నిప్రమాద బాదితులైన గిరిజన కుటుంబాలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాలు, పాలకులు మారిన క్యాలెండర్ లో డేట్ లు మారుతున్నా పేద గిరిజన కుటుంబాలలో వెలుగుల నింపినటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతుంటే ప్రతి పండగ ముందు పేదలకి ఇల్లుని ఇస్తానని చెప్తున్నారే గానీ మళ్లీ కొత్త సంవత్సరం ఉగాది కూడా వచ్చింది. ఈ ఉగాదికి కూడా ఇళ్ళు ఇవ్వన్నటువంటి పరిస్థితి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో గత నాలుగు రోజుల క్రితం మహాలక్ష్మి పురంలో మూడు గిరిజన కుటుంబాలు గుడిసెలు కరెంటు షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి ఆహుతి అయితే వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పూర్తిస్థాయిలో అందిస్తామని వాళ్లకు హామీ ఇచ్చిన పరిస్థితి లేదు, వారికి ఉండటానికి గూడు ఏర్పాటు చేస్తాం అని చెప్పడం కానీ జరిగిన పరిస్థితులు లేవు. లేస్తే మేము ఊళ్లే నిర్మిస్తామని చెప్పి ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. ఇటు ఒక వైపు చూస్తే ఇంకా ఇల్లు కాలిపోయే స్థితిలోనే పరిపాలన కొనసాగుతా ఉంది. బుధవారం జనసేన పార్టీ నుంచి వెళ్లి వాళ్లకి మా వంతుగా బట్టలు, బియ్యం అందించాం. ప్రభుత్వం వెంటనే వాళ్లకే ఆర్థిక సహాయాన్ని అందించి ఉండటానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలా మీరు ఇవని పక్షంలో జనసేన పార్టీ వాళ్ళకు అండగా ఉండి వాళ్లకి గూడుని ఏర్పాటు చేసి ఇస్తాం అని ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రావణ్, జై భీమ్ చిన్న, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు షేక్ రహీం, అక్బర్, చిన్న, శ్రీహరి, అని బాబు, రహమాన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.